Modi: మహారాష్ట్ర విజయంపై ప్రసంగించనున్న మోడీ.! 29 d ago
మహారాష్ట్రలో ఎన్డీయే, జార్ఖండ్ లో ఇండియా కూటమి విజయం సాధించాయి. మహారాష్ట్రలో మహాయుతి 224 స్థానాల్లో బీజేపీ కూటమి సంచలన విజయం సాధించింది. మధ్యాహ్నం 3గంటలకు మహాయుతి కూటమి నేతల ప్రెస్ మీట్ పెట్టనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు విజయోత్సవంలో ఫడ్నవీస్ పాల్గొననున్నారు. సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి ప్రధాని మోడీ చేరుకుంటారు. మహారాష్ట్ర విజయంపై ప్రజలను ఉద్ధేశించి మోడీ ప్రసంగించనున్నారు.